![]() |
![]() |

ముంబై కి చెందిన ప్రముఖ నవలా రచయిత 'బిలాల్ సిద్ధిఖీ'(Bilal Siddiqui)2015లో స్పై, యాక్షన్ జోనర్ లో రాసిన 'బర్ద్ ఆఫ్ బ్లడ్'(Bard Of Blood)అనే నవల విశేష ప్రాచుర్యం పొందింది. ప్రతి క్షణం ట్విస్ట్ లతో కూడిన ఆ నవలని చదువుతుంటే ఉద్వేగంతో పాటు, సంబ్రమాశ్చర్యాలకి లోనవుతాం. 2019 సెప్టెంబర్ 27 న ఈ నవల ఆధారంగా 'బర్ద్ ఆఫ్ బ్లడ్' పేరుతోనే హిందీలో వెబ్ సిరీస్ రిలీజయ్యింది. కింగ్ ఖాన్ 'షారుఖ్ ఖాన్'(Shah Rukh Khan)తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పై నిర్మించగా, రిభు దాస్ గుప్తా(Ribhu Dasgupta) దర్శకత్వం వహించాడు.ఇమ్రాన్ హష్మీ(Emraan hashmi),వినీత్ కుమార్ సింగ్, శోభితా ధూళిపాళ్ల(Sobhita Dhulipala), కీర్తి కుల్హారి, జైదీప్ అహ్లవత్ కీలకపాత్రలు పోషించారు.
నెట్ ఫ్లిక్స్ వేదికగా మొత్తం ఏడు ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బర్ద్ ఆఫ్ బ్లడ్' ఇప్పటికి ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ కి IMDBలో 6.7 రేటింగ్ ఉంది. రిలీజై ఆరు సంవత్సరాలు అవుతున్నా ఆ స్థాయిలో రేటింగ్ ని సాధిస్తున్న మరో మూవీ లేదు. నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించగా, ప్రతి సన్నివేశం, ఆద్యంతం సస్పెన్స్, ట్విస్టులతో సాగి ఎంతగానో ఆకట్టుకుంటుంది.
మాజీ ఇంటెలిజెన్స్ అధికారి, కబీర్ ఆనంద్ (ఇమ్రాన్ హష్మీ) నలుగురు భారతీయ గూఢచారులని రక్షించడానికి, బలూచిస్తాన్‌కి రహస్య మిషన్‌కి వెళ్లవలసి వస్తుంది. ఈ ప్రయాణంలో, కబీర్ తో ఇషా మథుర్ (విశాల ధూళిపాళ), వీర్ సింగ్ (విజయ్ వర్మ) జత కడతారు. ఈ క్రమంలో వచ్చే సస్పెన్స్, ట్విస్టులు ఎంతగానో ఉత్కంఠకి గురిచేస్తాయి.

![]() |
![]() |